డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకొస్తున్న డెవిల్

డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకొస్తున్న డెవిల్

రీసెంట్‌‌‌‌గా విడుదలైన ‘యానిమల్’ చిత్రానికి బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు అందించి సినిమా సక్సెస్‌‌‌‌లో కీరోల్ పోషించాడు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్.  కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘డెవిల్’ చిత్రానికి ఆయన సంగీతం అందించాడు. అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందించిన ఈ  చిత్రం డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ ‘‘అర్జున్ రెడ్డి’ తర్వాత నన్ను బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్పెషలిస్ట్‌‌‌‌ను చేశారు. 

కానీ నాకు పాటలకు సంగీతం ఇవ్వడం చాలా ఇష్టం.  ‘డెవిల్’ ఒక డిఫరెంట్ మూవీ. 1940 నేపథ్యం కాబట్టి బాగా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. నేచురల్‌‌‌‌గా ఉండాలని చాలా విదేశీ సంప్రదాయ వాయిద్యాలు వాడాం. ఇందులో  మూడు పాటలుంటాయి. వీటిలో ‘మాయే చేసి మెల్లగా’  పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్త లిరిసిస్ట్ ఆర్‌‌‌‌‌‌‌‌.వి.సత్య రాసిన లిరిక్స్  అందర్నీ ఆకట్టుకుంటాయి.  అలాగే ర్యాపర్ రాజకుమారి పాడిన లేడీ రోజ్ పాట స్పెషల్‌‌‌‌గా నిలుస్తుంది. 

ఇందులోని బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారి నట విశ్వరూపం చూస్తారు. సంయుక్త మీనన్ కూడా బాగా చేశారు. అభిషేక్ నామా గారు ఇప్పటివరకు నిర్మాతగానే తెలుసు. ఇప్పుడు దర్శకుడిగా ఆయన టాలెంట్ అందరూ చూస్తారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చే చాన్స్ ఉంది. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ రైటింగ్ చూసి ఆయన దగ్గర పని చేయాలనుకున్నా. నాకు మ్యూజిక్ బేస్డ్ మూవీని డైరెక్ట్ చేయాలని ఉంది. గిటార్ బేస్డ్ కథ, డ్రమ్స్ శివమణి గారి కథను తెరపైకి తీసుకు రావాలని ఉంది’ అని చెప్పాడు.