బాసర గోదావరిలో మునిగి భక్తుడి మృతి

బాసర గోదావరిలో మునిగి భక్తుడి మృతి

భైంసా, వెలుగు: నిర్మల్​ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గోదావరిలో స్నానానికి వెళ్లి మునిగి చనిపోయాడు. మేడ్చల్ జిల్లా గజ్జుల తండాకు చెందిన నాగరాజు(35), శ్రీనివాస్ బావాబామ్మర్దులు.  గోదావరిలో దిగిన నాగరాజు మునిగిపోయాడు.

ఇది చూసిన శ్రీనివాస్ తనకు ఈత రాదని, నాగరాజును కాపాడాలంటూ అరిచాడు. ఎవరూ సాహసించకపోవడంతో నాగరాజు గల్లంతయ్యాడు. పోలీసులు వచ్చి ఈతగాళ్లతో డెడ్​బాడీని బయటకు తీయించారు. గజ ఈతగాళ్లు లేకపోవడంతోనే తన బామ్మర్ది ప్రాణాలు కోల్పోయాడని శ్రీనివాస్​ ఆవేదన వ్యక్తం చేశాడు.