
బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ ఆదివారం శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. అమ్మవారిని జామ, డ్రాగన్ ఫ్రూట్, ఆపిల్, ద్రాక్ష, పుచ్చకాయ, అరటి, సీతాఫలం, దానిమ్మ, సపోటా వంటి పండ్లతో అలంకరించారు. మరోవైపు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఏడో రోజు చండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. – వెలుగు, పద్మారావునగర్