భద్రాచలం, వెలుగు: ఉగాది, రంజాన్, వీకెండ్ సెలవులతో శనివారం భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిరీక్షించారు. పడమర మెట్లు, సుదర్శన ద్వారం వద్ద క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి.
కాగా, ఉదయం రామపాదుకలకు భద్రుడి మండపంలో అభిషేకం, గర్భగుడిలో సీతారామచంద్రస్వామి మూలవరులకు సువర్ణ తులసీ దళ అర్చనను వేదోక్తంగా నిర్వహించారు.
