
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ధర్మదర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు చెప్పారు. దాదాపు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. క్యూలు, ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.