
పాపన్నపేట,వెలుగు: ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే మంజీర పాయల్లో పుణ్యస్నానాలు అచరించి దుర్గమ్మ దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో దర్శనానికి గంటల సమయం పట్టింది. అనంతరం అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు సమర్పించారు.
దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాలక మండలి,ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.