
నవరాత్రులు పూజలు నిర్వహించేందుకు భక్తులు సమాయత్తమవుతున్నారు. బుధవారం వినాయక చవితి కావడంతో ముందు రోజు మంగళవారం నగరంలో ఎక్కడ చూసినా గణపతి పండుగ సందడే కనిపించింది. గణపతి బప్పా మోరియా అంటూ యువకులు ఉత్సాహంగా విగ్రహాలను తమ మండపాలకు తీసుకెళ్లారు. విగ్రహ విక్రయకేంద్రాలు భక్తులతో కిటకిటలాడాయి. రోడ్ల వెంట పూజా సామగ్రి అమ్మకాలు జోరందుకున్నాయి. ఖైరతాబాద్‌లో ఉత్సవాలకు సిద్ధమైన 69 అడుగులు భారీ గణనాథుడిని చూసేందుకు భక్తులు ఒక రోజు ముందు నుంచే బారులు తీరారు. వెలుగు నెట్వర్క్