కొండపై ఈ చిలిపి పనులేంటయ్యా.. ఆదిపురుష్ డైరెక్టర్ పై విమర్శలు

కొండపై ఈ చిలిపి పనులేంటయ్యా.. ఆదిపురుష్ డైరెక్టర్ పై విమర్శలు

తిరుమలలో ఆదిపురుష్(Adipurush) డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. దర్శనం తరువాత ఆలయ ఆవరణలో హీరోయిన్ కృతి సనన్(Kruti Sanon)తో ఆయన ప్రవర్తించిన తీరు వివాదానికి దారితీసింది. జూన్ 6న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తిరుపతికు వచ్చిన కృతి సనన్.. జూన్ 7 బుధవారం ఉదయం కొండపై స్వామిని దర్శించుకుంది. ఆమెతో పాటు చిత్ర యూనిట్ కూడా దర్శనానికి వెళ్లారు. ఇక దర్శనం పూర్తి చేసుకొని కృతి వెళుతుండగా ఓం రౌత్ ఆమె దగ్గరకు వెళ్లి.. కృతిని హగ్ చేసుకొని, ఆమె చెంపపై ముద్దు (పెక్) పెట్టారు. 'గాడ్ బ్లెస్ యూ' అంటూ ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. 

Also Read:నా పెళ్లంటూ జరిగితే తిరుమల కొండపైనే : ప్రభాస్

దీనిపై స్వామివారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో పెక్ చేయడం, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం కామనే అయుండొచ్చు కానీ.. తిరుమల లాంటి పవిత్ర పుణ్య క్షేత్రంలో స్వామి వారి ఆలయ ఆవరణలో పేక్, హగ్ లాంటివి చేయడం సరైన పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఓం రౌత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై ఓం రౌత్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.