నా పెళ్లంటూ జరిగితే తిరుమల కొండపైనే : ప్రభాస్

నా పెళ్లంటూ జరిగితే తిరుమల కొండపైనే : ప్రభాస్

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Adipurush pre release event) సాక్షిగా పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్(Prabhas). ఆయన రాముడిగా చేస్తున్న సినిమా ఆదిపురుష్. జూన్ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో.. జూన్ 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో భాగంగా మాట్లాడిన ప్రభాస్ తన పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Also Read:ఆదిపురుష్ చేయడం మా అదృష్టం

” ఆదిపురుష్ సినిమా మేము చేయడం మా అదృష్టం. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. తిండి, నిద్ర, కుటుంబం మొత్తం వదిలేసి ఏడు నెలలు శ్రమించాం. డైరెక్టర్  ఓం రావత్‌(Om Raut) అయితే ఓ యుద్ధమే చేశాడు. ఇక జానకిగా నటించిన కృతి సనన్(Kriti Sanon).. అలా సీతగా కూర్చొని కంటినుంచి కన్నీళ్లు పెట్టుకున్న ఒక్క ఎక్స్ ప్రెషన్ తో సీతమ్మ అని అందరి చేత అనిపించుకుంది. అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రభాస్ అలా మాట్లాడుతుండగా మధ్యలో ఫ్యాన్స్ ప్రభాస్ పెళ్లి గురించి అడుగారు. దానిపై స్పందించిన ప్రభాస్.. ఖచ్చితంగా చేసుకుంటా.. నా పెళ్లి తిరుపతిలోనే అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ పెళ్లిపై కామెంట్స్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.