బాబాకు నైవేద్యంగా మద్యం బాటిళ్లు

బాబాకు నైవేద్యంగా మద్యం బాటిళ్లు

పంజాబ్ అమృత్ సర్ లోని ఆలయంలో మద్యం బాటిళ్లను బాబాకు నైవేద్యంగా సమర్పించారు. దాన్ని తిరిగి భక్తులు ప్రసాదంగా పంచారు. గత 90 ఏళ్లుగా ఈ వింత ఆచారాన్ని బాబా రోడే షా మందిరంలో పాటిస్తున్నారు. పంజాబ్ అమృత్ సర్ లోని ఫతేగఢ్ ప్రాంతంలో భోమా గ్రామంలో బాబా రోడే షా మందిరం ఉంది. ఏటా ఇక్కడ జాతర జరుగుతుంది. దీంతో మద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. ఇది ఇక్కడి విశిష్టత. బాబా రోడే షా ఆలయంలో పాల్గొనేందుకు యూపీ, హర్యానా, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాబా రోడే షా మందిరంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాని నమ్ముతామంటున్నారు భక్తులు.

సమంతా ఊ అంటుందా? ఊఊ అంటుందా?