
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శుక్రవారం భక్తులు బంగారు చింతాకు పతకాన్ని సమర్పించారు. కృష్ణా జిల్లా కలిదిండి మండలం కళ్లపాల్లెం గ్రామానికి చెందిన పి.సీతారామాంజనేయులు, భద్రమ్మలు 31 గ్రాముల బంగారంతో చేసిన చింతాకు పతకాన్ని సూపరింటెండెంట్ కిశోర్‌కు అందజేశారు.