ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం దేవస్థాన విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీశైలంలో కొలువైన మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన భక్తులు బాలం సుధీర్ దంపతులు దేవస్థానానికి నూతన ధర్మ ప్రచార రధం విరాళంగా ఇచ్చారు. మంగళవారం ( సెప్టెంబర్ 30 ) ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రచార రధాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.
రూ. 70 లక్షలతో ధర్మ ప్రచార రధాన్ని తయారు చేయించినట్లు తెలిపారు భక్తులు. ఆలయంలోని గంగాధర మండపం దగ్గర ధర్మ ప్రచార రథానికి పూజలు చేసారు అర్చకులు, వేదపండితులు. పూజల అనంతరం రధాన్ని ఈవో శ్రీనివాసరావుకు అప్పగించారు భక్తులు.
ఇదిలా ఉండగా.. అక్టోబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారని ఏపీ బీజేపీ తెలిపింది. జీఎస్టీ సంస్కరణలపై కర్నూలులో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటించనున్నారు. కర్నూలు సిటీలో ప్రధాని మోదీతో కలిసి కూటమి నేతల రోడ్ షో ఉంటుంది.
