తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 30 గంటల్లో సర్వదర్శనం

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..  30 గంటల్లో సర్వదర్శనం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది.  వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది.  అటు నడకదారిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండిపోయి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వ దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ టోకన్, నడకదారి దివ్యదర్శనం భక్తులకు సుమారు  5 గంటలు.. రూ.  300- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

ఇక 2023 ఆగస్టు 12 శనివారం రోజున తిరుమల  శ్రీవారిని 82 వేల 265 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.  శ్రీవారికి  41 వేల 300 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

మరోవైపు చిరుత దాడిలో చిన్నారి  లక్షితమృతి చెందిన క్రమంలో టీటీడీ చర్యలు చేపట్టింది. రెండు ఘాట్ రోడ్లలో ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకే టూవీలర్లను అనుమతిస్తున్నారు. అలిపిరి నడక దారిలో కూడా భక్తుల భద్రతపై టీటీడీచర్యలు తీసుకుంటోంది. గుంపులు గుంపులుగా సెక్యూరిటీ సహాయంతో 1000 మందిని ఒక్కసారిగా అనుమతిస్తున్నారు..30 నిముషాలకు ఒక్కసారి సెక్యూరిటీతో 1000 భక్తులనూ అనుమతిస్తుంది టీటీడీ.