నమో నాగోబా..భక్తులతో కిటకిటలాడిన జాతర

నమో నాగోబా..భక్తులతో కిటకిటలాడిన జాతర

ఆదివాసుల ఇలవేల్పు కేస్లాపూర్ నాగోబా జాతర రెండో రోజైన శనివారం భక్తులతో కిక్కిరిసోయింది. ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. దాదాపు 5 వేల మందికి పైగా భక్తులు 3 కంపార్ట్​మెంట్లలో క్యూ కట్టి నాగోబా దర్శనం చేసుకున్నారు.

గోవాడలో బస చేసిన మెస్రం వంశీయులు టెంట్లు వేసుకొని, పిండి వంటలు చేసుకొని బంధువులు, ఆత్మీయులతో ఆనందంగా గడిపారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు 600 మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు.    

వెలుగు, ఆదిలాబాద్ ​ఫొటోగ్రాఫర్/గుడిహత్నూర్​