తిరుమలలో దర్శన టికెట్ల కోసం భక్తుల ఆందోళన

తిరుమలలో దర్శన టికెట్ల కోసం భక్తుల ఆందోళన

తిరుపతి: వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగారు. మంత్రులు, వీఐపీల సిఫారసు లేఖలు తెచ్చినా దర్శనం కల్పించకపోవడంతో శనివారం రాత్రి తిరుమలలోని ఏఈవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. నిన్నకూడా ఇదే పరిస్థితిపై భక్తులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తాజాగా సిఫారసు లేఖలు తీసుకుని వచ్చిన భక్తులు రాత్రి 10 అవుతున్నా టికెట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనంతో ఆందోళన చేపట్టారు. కనీసం రూ.300 టికెట్లు అయినా ఇవ్వమంటూ అధికారులో వాగ్వాదానికి దిగారు. విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు వచ్చి భక్తులను శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు.