వైభవంగా అంబర్‌పేట్ మహంకాళి బోనాలు

వైభవంగా అంబర్‌పేట్ మహంకాళి  బోనాలు

అంబర్ పేట్ మహంకాళి టెంపుల్ లో బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాలు సమర్పించేదుకు మహిళా భక్తులు భారీగా వస్తున్నారు. అంబర్ పేట్ మహంకాళి ఆలయం తమకు సెంటిమెంట్ అంటున్నారు భక్తులు. సిటీలో ఎక్కడ ఉన్న ప్రతి ఏడాది అంబర్ పేట్  లోని ఆలయానికి వచ్చి బోనాలు సమర్పిస్తామంటున్నారు. మహంకాళి అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పూజలు చేశారు. ప్రజలందరి ఆరోగ్యం, శ్రేయస్సుకై అమ్మవారిని ప్రార్థించానని కిషన్ రెడ్డి తెలిపారు. 

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

అంబర్‌‌‌‌పేట్‌‌ బోనాల సందర్భంగా ఆది, సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిటీ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఉప్పల్ నుంచి అంబర్‌‌‌‌పేట మీదుగా వచ్చే వెహికల్స్ మల్లికార్జున నగర్,- డీడీ కాలనీ, శివం రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.  గోల్నాక, ముసారాంబాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్​ను సీపీఎల్‌‌ అంబర్‌‌పేట, సల్దానా గేట్,అలీకేఫ్‌‌ క్రాస్‌‌రోడ్స్‌‌ మీదుగా  మళ్లించనున్నారు.   ఉప్పల్‌‌ నుంచి అంబర్‌‌పేట, సీబీఎస్‌‌ వైపు వెళ్లే జిల్లా, సిటీ బస్సులను హబ్సిగూడ, తార్నాక,అడిక్‌‌మెట్, విద్యానగర్, ఫీవర్‌‌ ‌‌హాస్పిటల్, నింబోలి అడ్డా, చాదర్‌‌‌‌ఘాట్ మీదుగా పంపిస్తారు. కోఠి నుంచి ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్​ను నింబోలి అడ్డా, టూరిస్ట్‌‌ హోటల్‌‌, ఫీవర్ హాస్పిటల్‌‌, తార్నాక, హబ్సిగూడ మీదుగా ఉప్పల్‌‌ క్రాస్‌‌ రోడ్స్‌‌ వైపు మళ్లించనున్నారు.