ఆధ్యాత్మికం : ఎవరితో ఎలా ఉండాలి.. ఎవరితో ఎలా మాట్లాడాలి.. శ్రీకృష్ణుడు చెబుతున్న వాస్తవం ఏంటీ..?

ఆధ్యాత్మికం : ఎవరితో ఎలా ఉండాలి.. ఎవరితో ఎలా మాట్లాడాలి.. శ్రీకృష్ణుడు చెబుతున్న వాస్తవం ఏంటీ..?

 జనాలు ఎవరు ఎలా ఉండాలి.. ఎవరితో ఎలా సంప్రదించాలి.. ఎవరితో ఎంతవరకు సంభాషించాలి.. ఎక్కడ ఎంత వరకు ఉండాలి.. ఏ పని  ఎంతవరకు చేయాలి.. ఇలాంటి విషయాల గురించి  శ్రీకృష్ణుడు చెప్పిన వాస్తవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.  .  

కృష్ణుడి రథం సిద్ధంగా ఉంది. పద్దెనిమిది (18)రోజుల మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి ద్వారక వెళ్లి తన రాజ్యాన్ని చూసుకోవటానికి కృష్ణుడు సిద్ధమయ్యాడు. కృష్ణుడు అక్కడికి తిరిగి వెళ్లాలని ఎవరూ కోరుకోవడం లేదు ఇన్నాళ్లు తమతో ఉన్న గోవిందుడు దూరమవ్వడాన్ని వాళ్ల మనసులు తట్టుకోలేకపోతున్నాయి. ఆ విషయం వాళ్ల కళ్లను చూస్తే తెలుస్తుంది.

ALSO READ : మహాలయ పక్షాల్లో.. పితృదేవతలు ఎవరెవరికి అన్నం పెట్టాలి..

కృష్ణుడి పట్ల వాళ్లకున్నప్రేమ అలాంటిది! కానీ, అతను వెళ్లాలి. ఆ నిజాన్ని అందరూ అంగీకరించాల్సి వచ్చింది. అంతకుముందే యుధిష్టరుడికి పట్టాభిషేకం చేశారు. అంతకాలం పాండవులతో ఎందుకు కలిసి ఉండాలనుకున్నాడో ఉద్దేశం నెరవేరింది. కాబట్టి, కృష్ణుడు తన రథం ఎక్కడానికి రాజభవనం నుంచి బయటకు వచ్చాడు. అతడి వెనకాలే అర్జునుడు అనుసరించాడు. కృష్ణుడు అర్జునుడి వైపు తిరిగి, కలవరపడు తున్న అర్జునుడిని చూసి భరోసా ఇస్తున్నట్టు నవ్వాడు. తర్వాత అతడిని గట్టిగా అలింగనం చేసుకుని, చెవిలో ఏదో గుసగుసలాడాడు.

 అర్జునుడు కృష్ణుడితో పంచుకున్నది వెళ భక్తి' ఐదు రకాల భక్తి భావాల్లో దేవుడిని స్నేహితుడిగా చూసుకోవడం ఒకటి.అర్జునుడికి సఖ్యభావన ఉండేది. అతను కృష్ణుడిని ఆరాధించాడు. కానీ అతనికి ప్రియ మైన స్నేహితుడు కూడా... అందుకే  కృష్ణుడు అతన్ని కౌగిలించుకున్నాడు. స్నేహితుడిలా ఓదార్చాడు. ఆ తర్వాత ఆయన్ను చూడటా నికి అక్కడ గుమిగూడిన జన సముద్రం వైపు ముఖం తిప్పాడు. అందులో చాలా ముఖాలు, ఆయనకు తెలిసినవే. తర్వాత కొంచెం ముందుకు వెళ్లి కొంతమందికి చేయి అందించాడు. 

చిరునవ్వుతో ఆయనకు నమస్కారం చేస్తున్న చేతులను పట్టుకున్నాడు.. ఇంకొంతమందిని చూసి చేతులు ఊపుతూ సైగ చేశాడు. దూరంగా ఉన్న మరికొందరిని చూసి చిరునవ్వు నవ్వాడు. అది మెస్మరైజ్ చేసే చిరునవ్వు! ఆతర్వాత ఆయన రథం ఎక్కాడు. ఇలా పాండవుల రాజ్యం నుంచి కృష్ణుడి ద్వారకకు వెళ్లాడని భాగవతంలో వివరించారు.

 కృష్ణుడి చేసే అతిచిన్న పనుల్లో కూడా ఏదో ఒకటి నేర్చుకునే విషయం ఉంటుంది. అందరి పట్ల సమాన భావనతో ఉండగల సామర్థ్యం కృష్ణుడిది. అందరికీ ఆయన దగ్గరగా లేడు. కానీ, అందరికీ విష్ చేశాడు. అది అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఒకేలా కదిలించింది. ఒకే రకమైన సంతోషం కలిగించింది.

ఈ భావాలు ఉండాల్సిందే

పతంజలి యోగ సూత్రాల్లో సమాధి పాదం.. గుండె చక్రం మీద ధ్యానం చేసినప్పుడు కలిగే అనుభూతులను వివరిస్తుంది. చక్రాలలో నాలుగో చక్రం గుండె చక్రం. 'దీనిని 'అనాహత్' రక్తం అని పిలుస్తారు. ''అనాహత్' అంటే బాధపడకూడనిది. కానీ  మనం దాన్ని రిపీటెడ్ గా బాధ పెడుతూనే ఉంటాం! చక్ర ధ్యానంలో హృదయం మీద ధ్యానం చేయడం వల్ల కరుణ, సంతోషం, స్నేహం, శాంతి అనే నాలుగు భావాలు పుడతాయి. వీటిని లోతుగా పరిశీలించినప్పుడు సక్సెస్ ఫుల్ రిలేషన్ ఈ నాలుగూ చాలా ముఖ్యమని అర్థమవుతాయి.

మనుషులు- నాలుగు రకాలు

ప్రపంచంలో నాలుగు రకాల ప్రజలు ఉంటారు. సుఖి (సంతోషంగా ఉండేవాళ్లు).. దుఃఖి (అసంతృప్తితో ఉండేవాళ్లు)...పుణ్యాత్మ (నీతిమంతులు).. పాపాత్మ( నెటిటివ్​గా ఆలోచించేవాళ్లు) సంతోషంగా ఉండేవాళ్లు మనకు మనల్ని గైడ్ చేస్తుంటారు. పాజిటివ్​గా, ప్రోగ్రెస్సివ్ గా మారుస్తారు. అసంతృ ప్తితో ఉన్నవాళ్లతో, అసూయపడేవాళ్లతో...  అనారోగ్యంగా ఉన్నవాళ్లతో ఇలా ఎవరితోనై నా సరే.... కరుణతో ప్రేమగా వ్యవహరిస్తారు. ఇలాంటి మెంటల్​ ఆటిట్యూడిని డెవలప్ చేసుకుంటే చాలు...  మిగిలిన మూడు రకాల వ్యక్తుల గురించి ఆలోచించనవసరం కూడా లేదు. పాజిటివ్ ఎమోషన్స్ ని బయటకు వ్యక్తం చేయాలని కూడా ఏమీ లేదు. హానీ చే సేవాళ్లను తెలివిగా దూరం పెడుతూ మిగతా వాళ్లందరితో ప్రేమ, కరుణలతో ఉంటే చాలు.

క్లారిటీ ఉంటే చాలు

ఇందులో అన్నింటికంటే ఉత్తమ భాగం వెంటంటే.. 'సుఖి' లాగా ఉండటం చాలా ఈజీ... ఇలా ఉండటం వల్ల సంతోషం మన శాంతి సొంతమవుతుంది. ఈ లోకంలో మనం రోజూ ఎంతోమందిని కలుస్తుంటాం. ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు. వాళ్లను ఎలా డీల్​ చేయాలో తెలియక చాలా మంది కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు. వాళ్లతో మెలిగేటప్పుడు 'సుఖి' తాలూకు ఈ క్లారిటీ ఉంటే చాలు..!