ఆధ్యాత్మికం: ఆడవారు ఈ తప్పులు చేస్తే.. కష్టాలు... దరిద్రం వెంటాడుతాయి..

ఆధ్యాత్మికం:  ఆడవారు ఈ తప్పులు చేస్తే.. కష్టాలు... దరిద్రం వెంటాడుతాయి..

ఎంత కష్ట పడ్డా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయా.. సమస్యలు పెరుగుతున్నాయి.. మనశ్శాంతి లేఏ ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే.. మీ ఇంట్లో ఈ తప్పులు చేస్తుంటే.. ఎన్ని పూజలు చేసినా.. ఎంతమంది దేవుళ్లకు మొక్కినా కలిసి రాదని పండితులు చెబుతున్నారు. అయితే దైవానుగ్రహం ఉంటే సమస్యలకు ఉపశమనం మాత్రమే కలుగుతుంది.  పూర్తిగా పరిష్కారం కావాలంటే  ఇల్లు ఎలా ఉండాలి.. ఏం చేయాలి.. ఏం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం... 

ఇంటికి ఇల్లాలు శ్రీమహాలక్ష్మి అని పెద్దలు చెబుతుంటారు.అలాంటి ఇల్లాలు.. చేసే కొన్ని పనులు నష్టాన్ని,, ఇబ్బందిని కలిగిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. మగవారు పూజ చేసినా.. చేయకపోయినా కచ్చితంగా మహిళలు పూజలు చేస్తుంటారు. మహిళలు చేసే పూజ ఆ ఇంటి శాంతి .. సౌభాగ్యం.. ఆర్థిక పరిస్థితులపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది.

మహిళలు.. మగవారికంటే ముందే నిద్ర లేవాలి.  సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేయాలి.  ఆతరువాత మగవారిని లేపాలి.  సూర్యోదయానికి ముందే ఇంటి పనులు ప్రారంభించడం వల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆలస్యంగా ఇంటి పనులు మొదలు పెట్టడం వలన ప్రతికూల శక్తి పెరిగి.. ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. 

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు.. ముందుగా ఇంటిముందు నీళ్లు చల్లి బియ్యపు పిండితో ముగ్గు వేయాలి.  ఆ తరువాత పూజ గది.. వంట గది.. బెడ్​ రూం.. హాలు.. స్టోర్​ రూం.. వరండా ఇలా వరుసక్రమంలో శుభ్రం చేయాలి. ఇక రాత్రి భోజనం చేసిన తరువాత వాడేసిన గిన్నెలను సింక్​ లో ఉంచకూడదు.  ఎప్పటి పాత్రలు అప్పుడు క్లీన్​ చేసుకోవాలి.  లేదంటే మధ్యాహ్నం అన్ని పాత్రలను ఒకసారి.. రాత్రి మరోసారి క్లీన్​ చేసుకోవాలి.  సింక్​ లో ఉపయోగించిన గిన్నెలు లేకుండా చూసుకోవాలి.  ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు ఉండకూడు.  అలా ఉంటే ఆర్ధిక పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.  '

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. గదులను శుభ్రం చేసి చెత్తను ఒక మూల పెడతారు.. అలా పెట్టడం వలన దుమ్ము పేరుకుపోయి.. ప్రతికూల శక్తిని వృద్ది చేస్తుంది.  దీని వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి.  ఎప్పటి చెత్తను అప్పుడు డస్ట్​ బిన్​ లో వేయాలి.

 ఇంటి శుభ్రతే మనసుకు ప్రశాంతత చేకూరుస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే పెద్దలు ప్రతి రోజు ఇంటిని చీపురుతో ఊడ్చుకోవాలని.. శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతుంటారు.  సాయంత్రం క్లీన్​ చేసేటప్పుడు మాత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో చీపురితో ఊడ్చిన తరువాత వెనుక గది డోర్​ క్లోజ్​ చేసి..  ప్రధాన ద్వారం ఓపెన్​ చేసిన తరువాతే లైట్లు వేయాలి.  ఎట్టి పరిస్థితిలో లైట్లు వేసిన తరువాత క్లీన్​ చేయకూడదని పండితులు చెబుతున్నారు.

ఇక ఇంట్లో మొక్కలు పెంచితే పచ్చని మొక్కలు ఇంటికి అందాన్ని ఇస్తాయి. వీటి నుంచి వచ్చే గాలి మనసుకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి.   ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉంటే నెగిటివ్​ ఎనర్జీకి సంకేతమని అంటున్నారు పండితులు. 

ఎండిపోయిన మొక్కలను వెంటనే తొలగించి వాటి ప్రదేశంలోపచ్చని మొక్కలు నాటండి.  అలా చేయకపోతే ప్రతికూల శక్తి పెరిగి ఆర్ధిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొత్త మొక్కలు ఇంటికి పాజిటివ్​ ఎనర్జీని తీసుకొస్తాయి.  అందుకే పెద్దలు ఎప్పుడూ తులసి మొక్కను పచ్చగా ఉండేలా చూసేవారు.  

అందుకే పూజ  చేసిన తరువాత తులసి మొక్క ఎండి (నిద్ర) పోకుండా నీళ్లు పోస్తారు. పురాణాల ప్రకారం తులసి లక్ష్మీదేవితో సమానం కదా.. అంతేకాదు..ఇంటి గుమ్మం దగ్గర పచ్చగా ఉండే మనీప్లాంట్​ వంటి మొక్కలు కూడా అదృష్టానికి సంకేతమని చెబుతున్నారు.  అయితే ముళ్లు లేని మొక్కలను మాత్రమే ఇంట్లో పెంచుకోవాలంటున్నారు పండితులు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.