క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు నగదు ప్రోత్సాహక బహుమతులు

క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు నగదు ప్రోత్సాహక బహుమతులు

హైదరాబాద్ : జాతీయ స్థాయిలో నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన 33 మంది పోలీస్ అధికారులకు డీజీపీ అంజనీ కుమార్ శనివారం (జులై 22న) నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. 2018 నుండి 2023 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్, బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్, వాటర్ స్పోర్ట్స్, వాలీబాల్, రెజ్లింగ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వంటి విభాగాల్లో పలు పతకాలను సాధించిన పోలీస్ అధికారులకు డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగదు పురస్కారాలను అందచేశారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీలు అభిలాష బిస్త్, షికా గోయల్, మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, ఐజీ షా నవాజ్ కాసీంలతో పాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గోల్డ్ మెడల్ పొందిన వారికి రూ.3 లక్షలు, సిల్వర్ మెడల్ కు పొందిన వారికి రూ.2 లక్షలు, బ్రాంజ్ మెడల్ పొందినవారికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను ప్రదానం చేశారు. ఈ నగదు పురస్కారం పొందిన వారిలో డీసీపీ బి. శ్రీబాలా దేవి, ఏసీపీ టి. లక్ష్మి, ఆర్ఐలు జి. పవన రామకుమార్, మన్మోహన్, ఎస్ఐలు వెంకటేష్, రమేష్, తిరుపతి, ప్రణీత ఉన్నారు. 

నేరపరిశోధనలో, ఫింగర్ ప్రింట్ విభాగంలో విశేష ప్రతిభ కనపరిచిన ఏడుగురు పోలీస్ అధికారులకు కూడా డీజీపీ అంజనీకుమార్ ప్రశంసా పత్రాలను అందచేశారు.