రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజం కాదు

 రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజం కాదు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డీజీపీ మహేందర్ రెడ్డి. తనను బలవంతంగా ప్రభుత్వం సెలవుపై పంపిచిందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. ఆయన ఆరోపణలు ఏమాత్రం నిజం కావన్నారు.తాను ఇంట్లో జారిపడిన ఘటనలో ఎడమ భుజానికి గాయమైందని..పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని వైద్యుల సూచన మేరకు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4వ తేదీ వరకూ సెలవులో ఉండాల్సి వచ్చిందని డీజీపీ క్లారిటీ ఇచ్చారు.వైద్యుల సలహా మేరకు తిరిగి విధుల్లో చేరతానని చెప్పారు.ప్రతిరోజూ వ్యాయామం, ఫిజియోథెరిపీ చేస్తున్నానని చెప్పారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం బలవంతంగా తనను సెలవుపై పంపించిందని చెప్పడం బాద్యతారాహిత్యమైన ఆరోపణలేనని మహేందర్ రెడ్డి అన్నారు. అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వ అధికారులపై అసత్య ప్రచారం చేయడం తగదని రేవంత్ రెడ్డికి డీజీపీ సూచించారు. ఉన్నతస్థాయిలో బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఇటువంటి ఆరోపణలు పోలీసు శాఖ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. ఆరోపణలు చేసే ముందు విచక్షణను ఉపయోగించి, సంయమనం పాటించాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.

మరిన్ని వార్తల కోసం

 

సీపీ నోట టీఆర్ఎస్ స్క్రిప్ట్.. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు

కుట్ర వెనక ఉన్న అన్ని విషయాలను బయటపెడతాం