హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో 21 మంది ఏసీపీలు బదిలీ

  హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో 21 మంది ఏసీపీలు బదిలీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పలువురు ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్​సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న స్థానాల్లో మరికొందరికి పోస్టింగ్​ఇచ్చారు. బాలానగర్ ఏసీపీగా నరేశ్​రెడ్డి, శంషాబాద్​ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్,  చిక్కడపల్లికి సీహెచ్ శ్రీకాంత్, మాదాపూర్ కు సీహెచ్ శ్రీధర్, మేడ్చల్ కు సీహెచ్ శంకర్ రెడ్డి, సంతోష్ నగర్ కు సుఖ్​దేవ్ సింగ్, మలక్​పేటకు  సుబ్బరామిరెడ్డి, గాంధీనగర్ కు ఎ.యాదగిరి, ఎస్సార్ నగర్ కు ఎస్వీ రాఘవేంద్రరావు, కాచిగూడకు హరీశ్​ కుమార్, చాంద్రాయణగుట్టకు ఎ.సుధాకర్, కూకట్​పల్లికి రవికిరణ్ రెడ్డి, పేట్ బషీరాబాద్ కు బాలగంగిరెడ్డి, పంజాగుట్టకు పి.మురళీకృష్ణ, మహేశ్వరానికి ఎస్.జానకీరెడ్డి, షాద్​నగర్​కు ఎస్.లక్ష్మీనారాయణ, సైదాబాద్ కు సోమ వెంకటరెడ్డి, గోషామహల్ కు ఎస్.సుదర్శన్, చిలకలగూడకు శశాంక్ రెడ్డి, మహంకాళి ఏరియాకు ఎస్.సైదయ్య, అబిడ్స్ కు ప్రవీణ్ కుమార్ ను నియమించారు. పోస్టింగుల, బదిలీలు తక్షణమే అమలులోకి వస్తామని, ఆయా స్టేషన్లలో రిపోర్ట్​చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.