
జమ్మికుంట, వెలుగు: అనారోగ్యంతో వచ్చిన ప్రజలకు సత్వరం చికిత్స అందించి, ఆరోగ్యవంతులుగా చేయడమే తమ లక్ష్యమని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణం వావిలాల పరిధిలోని జమ్మికుంట-2 సబ్ సెంటర్‌ను డీహెచ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న సేవలను ఆరా తీశారు. గర్భిణులకు, చిన్న పిల్లలు, మహిళలకు అందుతున్న సేవలు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి సిబ్బందిని ప్రశంసించారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో చందునాయక్, ఎన్‌హెచ్ డీపీవో స్వామి, మెడికల్ ఆఫీసర్ రాజేశ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.