రాష్ట్రంలో ఫేక్ ఆస్పత్రుల మూసివేతకు రంగం సిద్ధం

రాష్ట్రంలో ఫేక్ ఆస్పత్రుల మూసివేతకు రంగం సిద్ధం

హైదరాబాద్, వెలుగు : రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేయించుకోకుండా, క్వాలిఫైడ్ డాక్టర్లు, స్టాఫ్‌‌‌‌‌‌‌‌ లేకుండా నడుస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌, క్లినిక్స్‌‌‌‌‌‌‌‌, డయాగ్నస్టిక్ సెంటర్ల మూసివేతకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌, క్లినిక్స్‌‌‌‌‌‌‌‌, కన్సల్టేషన్ రూమ్స్‌‌‌‌‌‌‌‌, నర్సింగ్ హోమ్స్‌‌‌‌‌‌‌‌, పాలి క్లినిక్స్‌‌‌‌‌‌‌‌, డయాగ్నస్టిక్ సెంటర్స్‌‌‌‌‌‌‌‌, ఫిజియో థెరపీ యూనిట్స్‌‌‌‌‌‌‌‌, డెంటల్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌, క్లినిక్స్‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావు అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోలను ఆదేశించారు. రానున్న 10 రోజుల్లో తనిఖీలు చేపట్టాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీల కోసం ప్రోగ్రామ్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోలతో టీమ్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.

క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌‌‌‌‌‌‌మెంట్ యాక్ట్ కింద చేసుకున్న రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్, నిబంధనల ప్రకారం హాస్పిటల్ ఉన్నదా? లేదా? డాక్టర్లు, స్టాఫ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్లను పరిశీలించాలని ఆదేశించారు. బయో వేస్ట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ నిబంధనలు పాటిస్తున్నరా? లేదా? చూడాలని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం లేని హాస్పిటళ్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. యుద్ధప్రతిపాదికన తనిఖీలు చేసి 10 రోజుల్లో తనకు రిపోర్ట్ ఇవ్వాలన్నారు. పర్మిషన్, క్వాలిఫైడ్ డాక్టర్స్ లేకుండా, నిబంధనలు పాటించకుండా ఆస్పత్రులు నడుపుతున్నారని ప్రజల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని.. ఈ నేపథ్యంలో తనిఖీలకు ఆదేశిస్తున్నామని డీహెచ్ పేర్కొన్నారు.