సర్పంచులకు ఆత్మహత్యలే గతి

సర్పంచులకు ఆత్మహత్యలే గతి
  • అప్పులు చేసి తలెత్తుకోలేకపోతున్నాం
  • సర్పంచ్‌‌‌‌ల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ధనలక్ష్మి

మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు:  గ్రామాలను డెవలప్ చేస్తూ తాము మాత్రం అప్పులపాలవుతున్నామని  సర్పంచుల ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ జూలూరు ధనలక్ష్మి అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం లో శనివారం ఆత్మహత్యాప్రయత్నం చేసిన సర్పంచ్ కందుకూరి స్వాతిని ఆమె సోమవారం పరామర్శించి, రూ.10 వేల సాయం చేశారు.  రాష్ట్రంలో సర్పంచులందరూ అప్పుల పాలయ్యారని, వడ్డీకి తెచ్చిన డబ్బులు కట్టలేక,ఓట్లేసినవారికి సమాధానం చెప్పలేక అవమానాల పాలవుతున్నారని అన్నారు.  ఆఫీసర్లు, ప్రభుత్వం టార్గెట్లు పెడుతూ వేధించడంసరికాదన్నారు. 

అభివృద్ది కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులకంటే ఎక్కువగా సర్పంచులు తమ సొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని, ప్రభుత్వం మాత్రం తమ కష్టాన్ని పట్టించుకోవడం లేదన్నారు. తాము కూడా ఎంపీ,ఎమ్మెల్యేల లాగే పబ్లిక్​ ఓట్లేస్తే గెలిచామని, వారికి ఇవ్వని మెమోలు తమకెందుకిస్తున్నారని నిలదీశారు. రాష్ట్రం లో ఇప్పటికే ఐదుగురు సర్పంచులు చనిపోయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కరోనా మ్​లో ఆఫీసర్లతో సమానంగా పనిచేసిన తమకు కనీసం గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ కం తక్కువ ఉన్న జీపీలకుస్పెషల్ ఫండ్స్ ఇవ్వాలని అన్నారు, సర్పంచులు మనోధైర్యంతో పోరాడాలన్నారు. ఆతర్వాత ఆమె స్వాతితో కలిసి ఎంపిడీఓ ఆఫీస్ లో జడ్పీ సీఈఓ నిర్వహించిన  విచారణలో పాల్గొన్నారు. 

కలెక్టర్ కు రిపోర్ట్​ ఇస్తాం: జడ్పీసీఈఓ

అత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన అడ్లూరు సర్పంచ్ స్వాతికి రావాల్సిన బిల్లులు, చెల్లింపులపై మూడు గంటల పాటు జడ్పీ సీఈఓ విచారణ జరిపారు. మొత్తం రూ. 6 లక్షల 81 వేలు సర్పంచ్​ స్వాతికి చెల్లించాల్సి ఉందని గుర్తించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రెండు నెలల్లో క్లియర్ చేస్తామని జడ్పీ సీఈఓ  సురేష్, డీపీఓ యాదయ్య తెలిపారు.