కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి : మంత్రి ధనసరి సీతక్క

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి : మంత్రి ధనసరి సీతక్క

తాడ్వాయి, వెలుగు: కాంగ్రెస్  బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని రంగాపూర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఇర్ప సూర్యనారాయణ, బీరెల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థి వంగరి అనసూయ సదానందం, కాటాపూర్ సర్పంచ్ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ హుస్సేన్, మేడారం అభ్యర్థి పీరీల భారతి వెంకన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని కార్యకర్తలు గడపగడపకూ తీసుకువెళ్లి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, పార్టీ మండలాధ్యక్షుడు బుల్లు దేవేందర్, పీఏసీఎస్​ చైర్మన్ పులి సంపత్ గౌడ్, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.