ఏం జరుగుతుందో అర్థం కాలే.. కోర్టులో ఏడుస్తూనే ఉన్నా: చాహల్‎తో విడాకులపై స్పందించిన ధనశ్రీ వర్మ

ఏం జరుగుతుందో అర్థం కాలే.. కోర్టులో ఏడుస్తూనే ఉన్నా: చాహల్‎తో విడాకులపై స్పందించిన ధనశ్రీ వర్మ

ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. చాహల్‎తో డివోర్స్ ఇష్యూపై తాజాగా ఓపెన్ అయ్యింది ధనశ్రీ. హ్యూమన్ ఆఫ్ బాంబే పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. చాహల్‎తో విడాకుల విచారణ సమయంలో కోర్టులో జరిగిన భావోద్వేగ క్షణాలను గుర్తు చేసుకుంది. విడాకులు తీసుకోవాలని ఇద్దరం ముందే డిసైడ్ అయినప్పటికీ.. కోర్టులో తాను తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని చెప్పింది ధనశ్రీ. 

“నాకు ఇప్పటికీ గుర్తుంది. కోర్టు తీర్పు ఇవ్వబోతున్నప్పుడు అక్కడే నేను నిలబడి ఉన్నా. డివోర్స్ తీసుకోవాలని ఇద్దరం ముందే నిర్ణయించుకున్నప్పటికీ కోర్టులో నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. అందరి ముందు కేకలు వేయడం మొదలుపెట్టా. ఆ సమయంలో నా లోపల ఏం జరుగుతుందో కూడా బయటకు చెప్పలేకపోయా. అలాగే కేకేలు వేస్తూ ఏడుస్తూనే ఉన్నానని. కోర్టు తీర్పు రాగానే చాహల్ ముందుగా బయటకు వెళ్లిపోయాడు” అని చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది చాహల్ మాజీ భార్య. 

కోర్టు విచారణ సమయంలో చాహల్ బి యువర్ ఓన్ షుగర్ డాడీ అనే టెక్స్ట్ఉన్న టీ-షర్ట్ ధరించడం అప్పట్లో వివాదస్పదమైంది. ఈ ఇష్యూపై కూడా ధనశ్రీ రియాక్ట్ అయ్యింది. ఈ టీ-షర్ట్ స్టంట్ కంటే ముందే ప్రజలు నన్ను నిందిస్తారని తెలుసని పేర్కొంది. కోర్టులో చాహల్ టీషర్ట్‎పై టెక్ట్స్‎ను అంత గమనించలేదని.. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాహల్ టీ-షర్ట్ వీడియోలను చూసినట్లు తెలిపింది ధనశ్రీ. ఇలాంటిది ఏమైనా ఉంటే పర్సనల్‎గా పంపించాలని.. టీ-షర్ట్ ధరించడమేంటని ప్రశ్నించింది. 

ఈ విషయంలో మీరు ఇంకా చాలా పరిణతి చెందాలని పరోక్షంగా చాహల్‎కు చురకలంటించింది.  ప్రజల్లో సానుభూతి తాను ఇలాంటి పనులు చేయనని.. మా ఇద్దరి కుటుంబ విలువలను భంగపరచకూడదనుకున్నానని చెప్పింది ధనశ్రీ. నా మాజీ భాగస్వామికి నేను ఎంత అండగా నిలిచానో నాకు తెలుసంది. కాగా, చాహల్, ధనశ్రీ వర్మ 2020 లో వివాహం చేసుకున్నారు. మనస్పర్ధాలు రావడంతో పరస్పర అంగీకారంతో 2025 లో విడాకులు తీసుకుని వివాహ బంధానికి ముగింపు పలికారు.