ఎర్రగడ్డలో ధనుంజయ ట్రావెల్స్ బీభత్సం..నలుగురికి గాయాలు

ఎర్రగడ్డలో ధనుంజయ ట్రావెల్స్ బీభత్సం..నలుగురికి గాయాలు

హైదరాబాద్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు బీభత్సం సృష్టిస్తున్నాయి, జులై 4వ తేదీ మంగళవారం కూకట్ పల్లిలో కావేరీ ట్రావెల్స్ బస్సు ..కారు, బైకును ఢీకొట్టగా..జులై 05వ తేదీ బుధవారం ఎర్రగడ్డ రైతు బజార్ ముందు ధనుంజయ ట్రావెల్స్ బస్సు  రెండు కార్లను అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్లలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  బస్సు ఢీకొట్టడంతో కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.