Dhanush Mrunal: మరోసారి సోషల్ మీడియాను ఊపేస్తోన్న డేటింగ్ రూమర్స్.. వైరల్ అవుతున్న ధనుష్, మృణాల్ చాటింగ్

Dhanush Mrunal: మరోసారి సోషల్ మీడియాను ఊపేస్తోన్న డేటింగ్ రూమర్స్.. వైరల్ అవుతున్న ధనుష్, మృణాల్ చాటింగ్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ థాకూర్ మధ్య డేటింగ్ రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి. మృణాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దో దీవానే షెహ్రర్ మే’. ఈ మూవీ టీజర్ ఆదివారం (నవంబర్ 23న) విడుదలైంది. ఈ సందర్భంగా మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్లో వీడియోని పంచుకుంది. ఆ వెంటనే హీరో ధనుష్ టీజర్‌పై స్పందిస్తూ.. “చూడటానికి, వినడానికి చాలా బాగుంది” అనే అర్థంలో కామెంట్ చేశారు. దీనికి మృణాల్ లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చింది. సో అంతే సంగతి.. ఇంకేం ఉంది. వీరిద్దరి సరదా సంభాషణతో సినీ ఫ్యాన్స్కి క్రేజీ న్యూస్ దొరికేసింది. ఈ క్రమంలో ధనుష్, మృణాల్ చాటింగ్ని స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ‘తలైవా’మరియు ‘తలైవి’ అని నెటిజన్లు తమ కామెంట్స్తో హీట్ పెంచుతున్నారు. 

మృణాల్-ధనుష్ రూమర్స్కి ఆజ్యం పోసిన ఇన్సిడెంట్స్:

సినీ ఇండస్ట్రీలో రూమర్స్, గాసిప్స్ చాలా సహజం. ముఖ్యంగా హీరో, హీరోయిన్లు ఏదైనా పార్టీలో కలిసినా, ఒకరి సినిమా ప్రమోషన్స్ కు మరొకరు హాజరైనా వెంటనే పుకార్లు గుప్పుమంటాయి పుట్టుకొస్తుంటాయి. కొన్నిసార్లు ఆ పుకార్లు నిజం కాగా.. మరికొన్నిసార్లు అవి కేవలం పబ్లిసిటీ కోసమే అని తేలిపోతుంటాయి. ఇపుడు ధనుష్, మృణాల్ మధ్య రూమర్స్ ఊపందుకున్నాయి. అసలు వీరిద్దరి మధ్య రూమర్స్ బలమవ్వడానికి గలా పలు విశేషాలు కూడా అందుకు సాక్ష్యంగా ఉన్నాయి.

ఆగస్టులో అజయ్ దేవగన్, మృణాల్ కలిసి నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' మూవీ లాంచ్ ఈవెంట్కు ధనుస్ ప్రత్యేక అతిథిగా హాజరవడం ఈ రూమర్స్ కు మరింత అజ్యం పోసింది. ఈ వేడుకలో ధనుష్, మృణాల్ ప్రత్యేకంగా మాట్లాడుకోవడంతో వీరిద్దరి మధ్య ఎదో ఉందని అనుకోవడం మొదలుపెట్టారు అభిమానులు.  

ALSO READ : స్పిరిట్, ది రాజా సాబ్తో ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

అంతే కాకుండా మృణాల్ పుట్టినరోజు వేడుకకు కూడా ధనుష్ హాజరయ్యారు. అంతకముందు ధనుష్ నటించిన బాలీవుడ్ మూవీ ‘తేరే ఇష్క్ మే’ర్యాప్ పార్టీకి కలిసి అటెండ్ అయ్యారు. అలాగే, కాజోల్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘మా’మూవీ స్క్రీనింగ్కి కూడా వీళ్లు కలిసే రావడం హాట్ టాపిక్ అయింది. ధనుష్ ఇద్దరు అక్కలు, డాక్టర్ కార్తీక కార్తీక్ మరియు విమల గీతలను ఇపుడు మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుంది. ఆసక్తికరంగా, వారిద్దరూ కూడా మృణాల్‌ను ఫాలో అవుతున్నారు. ఇలా వీరిద్దరూ పలు వేదికల్లో కనిపించడం వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వస్తున్న పూకార్లకు మరింత బలం చేకూర్చింది. ఐశ్వర్యతో విడాకుల తర్వాత మృణాల్తో డేటింగ్ చేస్తున్నారంటూ బాలీవుడ్ మీడియలోనూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే వీరిద్దరి రిలేషన్ షిప్పై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది మృణాల్. ఆ మధ్య ఓ ఇంటర్యూలో ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. ధనుష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలు, గాసిప్స్ చూసి చాలా నవ్వుకున్నానని చెప్పింది. సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్ కు ధనుష్ రావడంపై అభిమానులు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నిజానికి అజయ్ దేవగన్, ధనుష్ మంచి స్నేహితుతులు. ఆ ఈవెంట్ కు అజయ్ ఆహ్వానం మేరకు ధనుష్ వచ్చారు. అంతే తప్ప మా మధ్య ఏదో ఉందని తప్పుగా అనుకోనుకోవడం సరికాదు అని క్లారిటీ ఇచ్చారు మృణాల్. ఈ క్రమంలోనే టీజర్ పై మరోసారి ధనుష్ రెస్పాన్స్ కావడం, మృణాల్ లవ్ సింబల్ తో రిప్లయ్ ఇవ్వడం మరోసారి వీరి రూమర్స్కి కారణమయ్యాయి.

అయితే, ఈ రూమర్స్పై మృణాల్ ఠాకూర్ స్పష్టత ఇచ్చినా అభిమానులు మాత్రం వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఆశపడుతున్నారు. మరి వీరి స్నేహం కాస్త భవిష్యత్తులో ఒక సినిమాకు దారితీస్తుందో లేదో అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే, డైరెక్టర్గా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. మధ్యలో సినిమాలు సైతం నిర్మిస్తున్నారు. గతేడాది రాయన్, ఈ ఏడాది కుబేరా, ఇడ్లీ కడై సినిమాలతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. తేరే ఇష్క్ మే తెలుగులో 'అమర కావ్యం', అబ్దుల్ కలాం బయోపిక్తో పాటుగా మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. 

ఇక మృణాల్ సైతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. తెలుగులో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో ఆడియన్స్కు దగ్గరైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అడవిశేష్ డెకాయిట్, హే జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హో తో, పూజ మేరీ జాన్, తెలుగులో మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి.