
తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తున్న ధనుష్.. బాలీవుడ్‌లో మరో మూవీకి సైన్ చేశాడు. ఇప్పటికే మూడు హిందీ సినిమాల్లో అతను నటించాడు. అందులో రెండింటికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకుడు. రాంఝనా, అత్రంగీరే సినిమాల తర్వాత మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ఆనంద్ ఈ విషయాన్ని రివీల్ చేశాడు. గత రెండు చిత్రాల కంటే ఇందులో ధనుష్ పాత్ర డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పారాయన. ఈ యాక్షన్ లవ్ స్టోరీకి నిర్మాత కూడా ఆయనేనని తెలుస్తోంది. ఇప్పటికే రెండు విజయాలు అందుకున్న కాంబినేషన్ కావడంతో రాబోయే మూవీతో హ్యాట్రిక్ గ్యారంటీ అనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక మరో హిందీ మూవీకి కూడా ధనుష్ కమిట్ అయ్యాడని టాక్. మరోవైపు ఈ ఏడాది తెలుగులోనూ రెండు స్ట్రెయిట్ మూవీస్ చేస్తున్నాడు. వీటిలో శేఖర్ కమ్ముల మూవీ షూట్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సార్’ ఇప్పటికే మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో కొంత షూటింగ్ జరిగింది. ఇటీవల ధనుష్ ఆరోగ్యం బాగోకపోవడంతో షూట్‌కి బ్రేక్ ఇచ్చారు. ఈలోపు ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్టు సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్ ట్వీట్ చేశారు. తప్పుకోడానికి కారణాలు చెప్పనప్పటికీ, ఫ్యూచర్‌లో మరోసారి ఈ టీమ్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు దినేష్ చెప్పారు. మరోవైపు ధనుష్ నటించిన తమిళ మూవీ ‘మారన్’ వచ్చే నెలలో ఓటీటీ ద్వారా రిలీజ్ కాబోతోంది.