
తన ప్రతి చిత్రంలో ఏదో ఒక వెరైటీ ఉండేలా చూసుకునే హీరో ధనుష్. ఆ క్వాలిటీయే తనని అద్భుతమైన నటుడిగా, స్టార్ హీరోగా నిలబెట్టింది. నిన్న తన పుట్టినరోజు కావడంతో కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ని, టైటిల్‌ని విడుదల చేశారు. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘మారన్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. పోస్టర్‌లో ఎవరినో కొడుతూ యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నాడు ధనుష్. ‘అతని ధైర్యమే అతనికి ఆయుధం’ అనే కోట్‌తో ఈ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. మాళవిక మోహనన్, స్మృతి వెంకట్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మలయాళ స్క్రీన్ రైటర్స్ సర్బు, సుకాస్ వర్క్ చేస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ధనుష్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఏషియన్ సినిమాస్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనుంది. నిన్న స్పెషల్ పోస్టర్ ద్వారా ధనుష్‌ని విష్ చేసిన టీమ్, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు చెప్పింది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలోనూ ధనుష్ ఓ సినిమా చేస్తాడనే టాక్ ఉంది. దాన్ని కన్‌ఫర్మ్ చేసేలా ధనుష్‌కి విషెస్ చెబుతూ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. డైరెక్టర్‌గా వెంకీ అట్లూరి పేరు వినిపిస్తోంది. ఇక ధనుష్ యాక్ట్ చేసిన హిందీ చిత్రం ‘అత్‌రంగీరే’ వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ‘ద గ్రే మేన్’ అనే ఇంగ్లీష్ మూవీతో పాటు మరో రెండు తమిళ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు ధనుష్.