
ప్రస్తుతం పీరియాడికల్ జోనర్ లో రాబోతున్న వరుణ్ తేజ్,ధనుష్, దుల్కర్ సల్మాన్ మూవీస్ సినీ లవర్స్ ను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ మూడు సినిమాలు కరెన్సీ నేపథ్యంలో ఉంటూ.. సమాజంలో నెలకొన్న అసమానతలను చుట్టూ స్టోరీస్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాల పోస్టర్స్ కూడా 24 గంటలు గ్యాప్ లోనే అఫీషియల్ గా రిలీజ్ అయ్యాయి. దీంతో వీరి ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. వీటి పోస్టర్స్ ను చూసుకుంటే డబ్బు చుట్టూ తిరిగే కథలు అని తెలుస్తుంది.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula)..ధనుష్ (Dhanush) కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసేందే. ధనుష్ D51గా పట్టాలెక్కనున్న ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో శేఖర్ కమ్ముల చూపించిన కాన్సెప్ట్.. 'అసమానతను సూచిస్తూ, నగరాన్ని విభజించే కరెన్సీ నోట్లు..ఎంతో ఖరీదైన భారీ బిల్డింగులు..మరోవైపు పేదరికాన్ని ప్రతిబింబించేలా మురికివాడలు..ఈ రెండింటికి మధ్యలో పాత వంద రూపాయల నోట్ల కట్టని' చూపించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఎంచుకుంటూ ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. ప్రయోగాలు చేయడంలో ఈ మెగా హీరో ఎప్పుడు ముందుంటారు. పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్(Karuna Kumar) డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసేందే. .VT14 గా వొస్తున్న ఈ మూవీకు 'మట్కా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మట్కా అనేది ఒక రకమైన జూదం. రిలీజ్ చేసిన పోస్టర్ లో రూపాయి కాయిన్..చుట్టూ నోట్ల కట్టలు..మధ్యలో కారు..ఒక ఇల్లు .. ఇలా పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది.
1958-1982 మధ్య జరిగే ఈ కథతో యావత్ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నరట.
లేటెస్ట్ గా వెంకీ అట్లూరి(Venky Atluri) డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్(Dulquer Slaman) హీరోగా లక్కీ భాస్కర్(Lucky Baskhar) టైటిల్ తో మూవీ రాబోతుంది.ఈ మూవీ పోస్టర్ లో దుల్కర్ తల చుట్టూ తిరుగుతున్న రూ.100 నోట్లను చూపిస్తూ అమాంతం స్టోరీ లైన్ ను చెప్పేసారు మేకర్స్. ఈ మూవీ పీరియాడికల్ జోనర్ లో సాగుతూ..ఒక సామాన్యుడు ఆ సామాన్యమైన విజయాలను ఎలా సాధించాడు అనేది ఈ మూవీ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. ఇక కరెన్సీ నేపథ్యంలో పాత్రల క్యారెక్టర్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ మూవీను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
గతం లో టెంపర్, పటాస్.. ఒకే జోనర్ లో వచ్చి మంచి సక్సెస్ అయ్యాయి. ఇక ఈ కరెన్సీ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీస్..సమాజంలో ఎలాంటి మార్పును తీసుకొస్తాయో చూడాలి.