దేవన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణ లీల’. తిరిగొచ్చిన కాలం అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్. జ్యోత్స్న జి నిర్మిస్తున్నారు. అనిల్ కిరణ్ కుమార్ జి స్టోరీ, డైలాగ్స్ అందించారు. నవంబర్ 7న సినిమా విడుదల సందర్భంగా దేవన్ మాట్లాడుతూ ‘‘తన లీలా వినోదంతో కృష్ణుడు ఓ ప్రేమకథను ఎలా ఆడించాడనేది ప్రధాన కథాంశం. దైవత్వంతో జరిగిపోయిన కాలం తిరిగొస్తే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా చూపించాం.
జీవితంలో మనం కలిసే ప్రతి వ్యక్తితో ఏదో ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఈ జన్మలో మనతో ప్రయాణించే ప్రతి వ్యక్తితోనూ జన్మాంతర సంబంధం ఉంటుంది. ఆ బంధాన్ని ప్రేమించమని భగవద్గీత చెబుతోంది. ఆ ఎలిమెంట్‌ను చాలా కొత్తగా చూపించాం.
కథే హీరో అని నమ్మి, పవర్‌ఫుల్ కంటెంట్‌ను నిజాయితీగా చెప్పాం. మహాసముద్రం లాంటి కృష్ణతత్వాన్ని ఈ తరానికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాం. భీమ్స్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. డీవోపీ సతీష్ ముత్యాల విజువల్స్ ఇంప్రెస్ చేస్తాయి’ అని చెప్పాడు.
