
చేతిలో కర్ర పట్టుకొని మాస్క్ పెట్టుకోని వాళ్లను ‘మాస్క్ పెట్టుకోండి’ అని చెబుతున్న చిన్న పిల్లాడి వీడియో ఈ మధ్య వైరల్ అయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో మాస్క్ లేకుండా వీధుల్లోకి వచ్చిన వాళ్లని ప్రశ్నించిన ఆ అయిదేళ్ల పిల్లాడి పేరు అమిత్. దలైలామా రోడ్డులోని షెల్టర్ హోమ్‌లో పేరెంట్స్‌తో ఉంటున్నాడు. పేరెంట్స్ లైట్ బెలూన్స్ అమ్ముతారు. కైలాష్ దోబల్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియోని లక్షలమంది చూసి బుడ్డోణ్ని మెచ్చుకున్నారు. ‘‘మాస్క్ పెట్టుకోమని పోలీసులు అందరికీ చెప్పడం చూసి నేను కూడా మాస్క్ పెట్టుకోని వాళ్లకు ‘మాస్క్ పెట్టుకోండి’ అని చెప్పాను” అన్నాడు అమిత్. పెద్దయ్యాక పోలీస్ అవ్వాలనేది ఈ చిన్నోడి కల. కాగా.. లోకల్ పోలీసులు అమిత్‌ను కొవిడ్ సేఫ్టీ ప్రొటోకాల్ మెంబర్‌గా నియమించారు. వీడియోలో అమిత్ కాళ్లకి చెప్పులు కూడా లేకపోవడం చూసి కొందరు షూ, డ్రెస్ కొనిచ్చారు. చదువుకునేందుకు అన్నివిధాలా సాయం చేస్తా మంటూ ముందుకొచ్చారు మరికొందరు.