కరోనాపై పోరులో రోల్ మోడల్ గా ధారావి

కరోనాపై పోరులో రోల్ మోడల్ గా ధారావి
  • ఒకప్పుడు వైరస్కు సెంటర్ పాయింట్
  •  ఇప్పుడు బాగా తగ్గు తున్న కేసులు
  •  ఇంటింటికీ తిరిగి టెస్టులు చేస్తున్న ఆఫీసర్లు
  •  కొద్ది లక్షణాలు ఉన్నాక్వారంటైన్ అవుతున్న జనం
  •  ఆదర్శంగా నిలుస్తున్న స్లమ్ ఏరియా

 

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అది. 2.1 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఆ ప్రాంతంలో జనాభా 10 లక్షలపైనే. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఇప్పుడు ఆ స్లమ్ ఏరియా రోల్ మోడల్ గా నిలుస్తోంది. మొన్నటివరకు యావరేజ్ గా రోజుకు 60 కరోనా కేసులతో హడలెత్తిన ఆ ప్రాంతంలో ఇప్పుడు చాలా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అదే.. ముంబైలోని ధారావి. ఆఫీసర్ల కృషి.. స్థానికుల సహకారం.. ఫలితంగా కరోనాపై ధారావి గెలుపు దరువు వేస్తోంది.

ఇండియాలోకి కరోనా ఎంట్రీ అయినప్పటి నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబై వణికి పోతోంది. ఇక్కడి అతిపెద్ద స్లమ్ ధారావిలోనే ఎక్కువ కేసులు నమోదవుతూ వచ్చాయి. ఒకానొక టైంలో ముంబైలో కరోనాకు ధారావి సెంటర్ పాయింట్ గా నిలిచింది. తక్కువ స్థలంలో ఎక్కువ జనాభా ఉండటంతో ఒకరి నుంచి ఒకరికి వేగంగా వైరస్ అంటుకోవడం మొదలుపెట్టింది. దీన్ని పసిగట్టిన ఆఫీసర్లు.. అంతే వేగంగా నివారణ చర్యలు చేపట్టారు .

ప్రతి ఇంటి తలుపుతట్టి..

ఆసియాలోని అతిపెద్ద స్లమ్ ఏరియా అయిన ధారావిలో కరోనా కట్టడి కోసం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ ఏరియాలో ఏప్రిల్, మేలో దాదాపు ప్రతి ఇంటికి వెళ్లి బాడీ టెంపరేచర్, ఆక్సిజన్ లెవల్స్ చెక్  చేశారు, అట్ల 47,500 ఇండ్లల్లో 7 లక్షల మందికి పరీక్షలు నిర్వహిరు. లక్షణాలు ఉన్నవాళ్లను వెంటనే క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. స్థానిక స్కూల్స్, స్పోర్స్ క్లబ్స్ ను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు. ప్రత్యేక మెడికల్ టీమ్స్  ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ అందించారు. బాధితుల కాంటాక్ట్ ను కూడా వేగంగా ట్రేస్ చేసి, వారికి కూడా టెస్టులు చేయించారు. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచి ట్రీట్మెంట్ అందించడం.. నెగెటివ్ వచ్చిన వారిని ఇంట్లోనే క్వారంటైన్లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిపై నిఘా ఉంచారు. రోజూ ధారావిలోని ప్రతి గల్లీని శానిటైజ్ చేశారు. దీంతో ఏప్రిల్, మే నెలతో పోలిస్తే ఇప్పుడు కేసులు, డెత్స్ సంఖ్య భారీగా తగ్గిపోగ్గి యింది.

దడ పుట్టిచ్చిన మే

ధారావిలో మే లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదయ్యాయి. యావరేజ్ గా రోజుకు 60 కేసులు వచ్చాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యా రు. అయితే.. ముంబై మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్ దిగావ్ కర్ ఆధ్వర్యంలో ఆఫీసర్ల టీమ్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. జన సాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతం కావడంతో వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ కు అవకాశాలు ఉన్నాయని గుర్తించి.. పకడ్బందీ ప్లాన్ అమలు చేసింది. యావరేజ్ గా ఇక్కడ వంద చదరపు అడుగుల ఇంట్లో ఏడుగురు ఫ్యామిలీ మెంబర్స్ నివసిస్తుంటారు. ‘‘పక్కా ప్లాన్ప్రకారం ముందుకు వెళ్లాం . అందరిలో ఫిజికల్ డిస్టెన్స్, మాస్కులు వేసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించాం . అనుమానితులను, కాంటాక్ట్ ను క్వారంటైన్ చేశాం” అని అసిస్టెంట్ కమిషనర్ కిరణ్ దిగావ్ కర్ చెప్పారు. ముందస్తుగానే పేషెంట్లను గుర్తించడంతో సమస్య తగ్గుముఖం పట్టిందన్నారు. ‘‘చివరి నిమిషంలోనే పేషెంట్లు టెస్టుల కోసం ముందుకు వస్తుంటారు. కానీ ధారావిలో ఎర్లీ స్టేజ్ లోన గుర్తించాం . జనం కూడా సహకరించారు. తొలుత కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించిం ది. కానీ.. మరణాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి’’ అని కిరణ్ వివరించారు.

తగ్గుతున్న కేసులు

దేశంలో కరోనా కేసుల్లో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ శనివారం నాటికి 1,04,568 పాజిటివ్ కేసులు నమోదవగా.. అందులో ముంబైలోనే 56,831 కేసులు ఉన్నాయి. ధారావిలో ఏప్రిల్, మే నెలల్లోభారీగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ధారావిలో మే నెలలో యావరేజ్ గా రోజుకు 60 కేసులు నమోదవగా.. ఇప్పుడు యావరేజ్ గా రోజుకు 20 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ముంబై వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల్లోకోలుకున్న వారి సంఖ్య 41శాతం ఉంటే.. ధారావిలో మాత్రం 51శాతంగా ఉంది.

స్ట్రిక్ట్ లాక్ డౌన్.. ఫుల్ అవేర్నెస్

మార్చి 24 నుంచి లాక్ డౌన్ అమల్లోకి రాగా.. ధారావిలో ఆఫీసర్ల టీమ్ స్ట్రిక్ట్ గా అమలుచేసింది. ఆరోగ్యం బాగోలేని వాళ్లందరికీ టెస్టులు చేయించింది . స్థానికులకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందజేసింది. రంజాన్ టైంలో ముస్లింలకు క్వారంటైన్ సెంటర్లలోనే ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పేషెంట్లందరికీ ఉచిత వైద్య సేవలు, ఉచిత ఆహారం అందించింది. బెడ్లు సరిపోకపోతే అప్పటికప్పుడు ఆఫీసర్లు కొన్ని ఇండ్లను కూడా ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. ‘‘ధారావిలో వైరస్ తో పోరులో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. వైరస్ ప్రభావం ఇంకా పోలేదు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్ చెప్పారు.