కేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలె: ఎంపీ అర్వింద్

కేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలె: ఎంపీ అర్వింద్

మార్చి 11న జరిగిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణతో మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీకి వచ్చిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఈ చిత్తశుద్ధి రాష్ట్ర అభివృద్ది, తెలంగాణ మహిళపట్ల ఉంటే బాగుండని ఆయన హితవు పలికారు. మార్చి 12వ తేదిన ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ అర్వింద్..కవిత ఈడీ విచారణతో మంత్రులు రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ వదిలి పెట్టి ఢిల్లీకి వచ్చారని చెప్పారు. ఈడీ విచారణలో కవిత సరైన సమధానాలు చెప్పలేదన్నారు. తప్పుడు సమాధానాలు ఇస్తే త్వరగా అరెస్టు ఖాయని అర్వింద్ అన్నారు. తెలంగాణ సొమ్ము దోచుకున్నారు.. ఇప్పుడూ ఢిల్లీ ప్రజల సొమ్ము దోచుకున్నారని విమర్శించారు. కవితకు లక్షల రూపాయల వాచ్ లు, కోట్ల రూపాయల చెవి కమ్మలు ఎక్కడివని ప్రశ్నించారు అర్వింద్.

కేసీఅర్, కేటీఆర్ అవినీతి అందరికీ తెలుసన్న ఎంపీ అర్వింద్..బీజేపీ అంటే అవినీతి రహిత పార్టీ అన్నారు. అప్పుడు వాజ్ పేయి కానీ.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కానీ అవినీతి అంటే సహించదని పేర్కొన్నారు. తప్పు చేయకుంటే ఎందుకు అంత రచ్చ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు అర్వింద్. రాజకీయాల్లో అంటరాని వాళ్లు కల్వకుంట్ల కుటుంబం అని మండిపడ్డారు. మీరు తప్పు చేయకుంటే 16న విచారణకు రావాలి.. తప్పు చేయకుంటే మీరు నిజాయితీగా బయటకి వస్తారని తెలిపారు. బండి సంజయ్ కవితపై చేసిన వ్యాఖ్యలను నేను సమర్తించను..ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు అయిఉండొచ్చన్నారు. కేసీఆర్, కవితలు ఒత్తిడి చెయ్యడం వల్లే అరుణ్ రామచంద్ర పిళ్ళై.. ఈడీ కి ఇచ్చిన స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళాడని..ఇది లిక్కర్ కేసులో మరింత కీలకం కానుందని అర్వింద్ చెప్పారు. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసి, ఎన్నికలకు పోవాలని పేర్కొన్నారు.