ధర్మపురి, వెలుగు : ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన మండపంలో పుణ్యాహవచనం, బ్రహ్మకలశ స్థాపన, అంకురార్పణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పట్టణంలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే పుట్ట బంగారం కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే చెప్పారు.
