- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: మూడో విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా మూడో విడత ఎన్నికల నిర్వహణపై ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్ నగర్ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, స్టేజ్2 ఆర్ వోలతో రివ్యూ నిర్వహించారు.
చివరి ఎన్నికలను సైతం ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టి, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. మొదటగా మారుమూల గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించాలని సూచించారు.
పోలింగ్ అనంతరం కౌంటింగ్ వేగవంతంగా జరిగేలా అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని, ఉప సర్పంచ్ ఎన్నిక పారదర్శకంగా చేపట్టాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీపీవో భిక్షపతి పాల్గొన్నారు.
