రవాణాశాఖ జిల్లా అధికారిగా జగదీశ్

రవాణాశాఖ జిల్లా అధికారిగా జగదీశ్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం జిల్లా కు రెగ్యులర్ జిల్లా రవాణా శాఖ అధికారిగా ధర్మపురి జగదీశ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు  ఇక్కడ ఇన్​చార్జ్ రవాణా శాఖ అధికారిగా పని చేసిన వాకాదాని వెంకట రమణ ఇక నుంచి ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో నే ఎంవీఐ గా కొనసాగనున్నారు. 

ఈ సందర్భంగా జిల్లాకు ఫస్ట్ పోస్టింగ్ గా వచ్చిన జగదీశ్​ కు ఏఎంవీఐ, ఎంవీఐలు, సిబ్బది శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో డీటీఓ పోస్టును సాధించినట్లు తెలిపారు.