హైదరాబాద్, వెలుగు : ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి ప్రాజెక్టు వల్ల తమ భూములు, ఇళ్లు కోల్పోతున్నామని, తమకు మార్కెట్ ధర ప్రకారం న్యాయమైన పరిహారం ఇవ్వాలని సర్కారుకు ‘ధర్మపురి దేవాలయ అభివృద్ధి భూమి నిర్వాసితుల సంఘం’ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సంఘం నేతలు రంగా అశోక్, రవిశంకర్ మాట్లాడుతూ.. అధికారులు ఎలాంటి డీపీఆర్, సామాజిక ప్రభావ అంచనా లేకుండానే గోదావరి ఒడ్డున ఉన్న 17 ఆస్తులు, పలు ఎకరాల భూములను తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
