కుబీర్​ మండలం నిగ్వాలో స్టూడెంట్ల ధర్నా

కుబీర్​ మండలం నిగ్వాలో స్టూడెంట్ల ధర్నా

కుభీర్, వెలుగు: టీచర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ స్టూడెంట్లు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. నిర్మల్​ జిల్లా కుభీర్​ మండలం నిగ్వా గవర్నమెంట్​హైస్కూల్​లో 200 మంది వరకు స్టూడెంట్లు ఉన్నారు. ప్రైమరీ స్కూల్​లో ముగ్గురు టీచర్లు, హైస్కూల్​లో ఐదుగురు టీచర్లు ఉన్నారు. తెలుగు మీడియం, సైన్స్​టీచర్లు లేరు. టీచర్లు లేక చదువులో వెనకపడుతున్నామంటూ స్టూడెంట్లు మంగళవారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 

గతేడాది టెన్త్​ క్లాస్​లో వంద శాతం రిజల్ట్స్​వచ్చాయని, కానీ టీచర్లు లేక ఈ ఏడాది ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పలుసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న అనుసూయ పవార్​ ట్రస్ట్​ చైర్మన్​రామారావు పటేల్​స్టూడెంట్లకు మద్దతు తెలిపారు. ఎంఈవో చంద్రకాంత్​వచ్చి టీచర్లను త్వరలోనే నియమిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.