తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ధర్నా

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ధర్నా

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో  తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ధర్నా నిర్వహించారు. మహేశ్వరం డిపోలో ఉదయం నుండి ఒక్క బస్సుకూడా బయటకు వెళ్ళకుండా  వారు ఆందోళనకు దిగారు. డీఎం వేధిస్తున్నారని  తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు తెలిపారు. రూ. 1750లు ఇస్తామని చెప్పి ఆదాయం రాకుంటే  900 రూపాయలే ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికంగా డీజీల్ ఖర్చు అవుతోందని…అది ఎక్కడ పోతుందని అనటంతో పాటు.. లీటరు డీజిల్ కు  రెండు కీలోమీటర్ల లెక్క మైలేజ్ వస్తుందని డీఎం అంటున్నారని నిరసన తెలిపారు. రోజుకు 2లక్షల రూపాయల ఖర్చు వస్తుందని, అదాయం మాత్రం 50 వేల రూపాయలే వస్తుందంటున్నారని చెబుతున్నారు. ఇలాగే వేధిస్తే తాము డ్యూటీలకు రాబోమని తేల్చిచెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో… డీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాత్కాలిక డ్రైవర్లు నిరసన విరమించారు.