కలెక్టరేట్ ​వద్ద టీఎన్జీవోల ధర్నా

కలెక్టరేట్ ​వద్ద టీఎన్జీవోల ధర్నా

మెదక్, వెలుగు: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్​ వద్ద టీఎన్జీవోలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కొత్త పెన్షన్ విధానం రద్దు చేయాలని,  కాంట్రాక్ట్ అండ్ ఔట్​సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేయాలని, ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్​ చేశారు.

అనంతరం డీఆర్​వో  పద్మశ్రీకి మెమొరాండం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, సహాధ్యక్షుడు ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు ఫజలుద్దీన్, సంయుక్త కార్యదర్శులు చిరంజీవచార్యులు, శివాజీ, రాధా, మెదక్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు రామా గౌడ్, శ్రీకాంత్, తులసి రామ్, లవన్, సత్యనారాయణ, సలీం, గంగకృష్ణ పాల్గొన్నారు.