
APPSC పేపర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసింది. ఈ కేసులో ధాత్రి మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యామ్ సైన్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు డైరక్టర్ గా ఉన్న మధును హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషనుకు తరలించారు. APPSC గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ల వ్యాల్యూషన్ లో అక్రమాలకు పాల్పడ్డారని మధుపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న మధును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
APPSC గ్రూప్1 పరీక్షలో అర్హత సాధించిన వారి జాబితాను 2021 ఏప్రిల్28న ప్రకటించారు. ఇందుకోసం ‘కామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం రూ.1.14 కోట్లు చెల్లించింది. గ్రూప్ ఫలితాల్లో తొమ్మిది మందికి 74 మార్కులు రావడం అనుమానాలకు తావచ్చింది. కమిషన్ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా కొందరికి 99శాతానికి పైగా మార్కులు వేసేశారని అప్పట్లో సంచలనం రేకెత్తించింది.నిందితుని నుంచి డిజిటల్ మూల్యాంకనానికి వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.