దీనమ్మ జీవితం మూవీ జనవరి 5న విడుదల

దీనమ్మ జీవితం మూవీ జనవరి 5న విడుదల

దేవ్, ప్రియా చౌహాన్, సరిత ప్రధాన పాత్రల్లో ‘ప్రేమ పిపాసి’ ఫేమ్ మురళీ రామస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దీనమ్మ జీవితం’.  వై.  మురళీ కృష్ణ, వెంకటలక్ష్మీ, దివ్య సంతోషి, సోనియా నిర్మించారు. జనవరి 5న సినిమా విడుదల కానుంది. శుక్రవారం సాయంత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. 

ఈ సందర్భంగా దేవ్ మాట్లాడుతూ ‘ఇంటెన్స్‌‌ కంటెంట్‌‌తో వస్తున్న చిత్రమిది. కచ్చితంగా పెద్ద విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నాడు.  సమాజంలో జరిగే ఈ కథ తప్పకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పింది ప్రియ. దర్శకుడు మురళీ రామస్వామి మాట్లాడుతూ ‘‘యానిమల్’ లాంటి రా ఫ్యామిలీ సినిమా ఇది.   చాలా డిఫరెంట్‌‌గా ఉంటుంది. మలయాళం, తమిళ పరిశ్రమలే కాదు తెలుగులోనూ డిఫరెంట్‌‌ కంటెంట్‌‌తో సినిమా చెప్పగలరని నిరూపించే చిత్రమవుతుంది’ అని చెప్పాడు.