ధోనీ సార్.. మీ  జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోను

ధోనీ సార్.. మీ  జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోను

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. గ్రౌండ్ లో ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ చూడటానికి ఎంతదూరమైనా వస్తారు. ఒక్క ఆటోగ్రాఫ్, ఫొటో దిగడానికి ఎంతసేపైనా వెయిట్ చేస్తుంటారు. ధోనీ కూడా అభిమానులను సంతోషపెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా కమెడియన్ యోగి బాబుకు ధోనీ తను ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.

యోగిబాబు ధోనీకి పెద్ద ఫ్యాన్. చాలాసార్లు కలుద్దామని ట్రై చేసి విఫలమయ్యాడు. ఐపీఎల్ కోసం ధోనీ ఇప్పటినుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ధోనీ ప్రాక్టీస్ చూడటానికి స్టేడియానికి వెళ్లిన యోగిబాబును దగ్గరకు పిల్చి తను ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ ఇచ్చాడు. దానిపై ‘బెస్ట్ విషెస్ యోగిబాబు’ అని కూడా రాశాడు. ఆ బ్యాట్ పట్టుకొని మురిసిపోయిన యోగిబాబు ‘బ్యాట్‌ గిఫ్ట్‌గా ఇచ్చినందుకు థాంక్యూ ధోని సార్‌. మీ క్రికెట్‌ జ్ఞాపకాలు నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి’ అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.