చెన్నై కెప్టెన్సీపై ధోనీదే నిర్ణయం

చెన్నై కెప్టెన్సీపై ధోనీదే నిర్ణయం

ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ను సీఎస్కే యాజమాన్యం కొనుగోలు చేయడంపై  ఎం. ఎస్ ధోని సంతోషం వ్యక్తం చేసినట్లు చెన్నై టీమ్ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించాడు.  వేలంలో అతన్ని తీసుకునేందుకు తీవ్రంగా పోటీ ఎదుర్కోవాల్సి వచ్చిందన్నాడు. చివరకు స్టోక్స్ సీఎస్కే టీమ్లోకి వచ్చినందుకు ఆనందంగా ఉందని తెలిపాడు. అయితే కెప్టెన్సీ ఎంపిక ఉంటుందని..దీనిపై ధోనియే నిర్ణయం తీసుకుంటాడని చెప్పాడు. కైల్ జేమీసన్ను స్టీఫెన్ ఫ్లెమింగ్ సూచన మేరకు కొనుగోలు చేసినట్లు వివరించాడు. గత సీజన్లో మెరుగ్గా ఆడలేదని..అయితే వచ్చే సీజన్లో సీఎస్కే టీమ్ బాగా రాణిస్తుందన్న నమ్మకముందని కాశీ విశ్వనాథన్ వెల్లడించాడు. 


 
 ఐపీఎల్‌ 2023 కోసం  మినీ వేలం నిర్వహించారు. ప్లేయర్ల కొనుగోలు కోసం అన్ని ఫ్రాంచైజీలు రూ. 160 కోట్లు ఖర్చు చేశాయి. ఈ వేలంలో అత్యధికంగా ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ను రూ.18.5 కోట్లకు పంజాబ్‌ కొనుగోలు చేసింది. ఐపీఎల్  చరిత్రలోనే  అత్యధిక ధర పలికిన ఆటగాడిగా సామ్‌ కరన్‌ నిలిచాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్‌ గ్రీన్‌ని ముంబై టీమ్ రూ.17.5 కోట్లకు దక్కించుకుంది. ఆ తర్వాత బెన్‌స్టోక్స్‌ ను రూ.16.25 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది.