వచ్చే ఏడాది ఐపీఎల్ కూ ధోనీయే కెప్టెన్

వచ్చే ఏడాది ఐపీఎల్ కూ ధోనీయే కెప్టెన్

చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాథన్

చెన్నై: ఐపీఎల్‌‌–13లో ప్లే ఆఫ్‌‌ బెర్త్‌‌ను చేజార్చుకున్న చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌.. అప్పుడే వచ్చే సీజన్​పై ఫోకస్‌‌ పెట్టింది. నెక్స్ట్‌‌ ఇయర్‌‌ కూడా తమ టీమ్‌‌ను ధోనీయే లీడ్‌‌ చేస్తాడని ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. లీగ్‌‌కు మరో ఆరు నెలల టైమ్‌‌ ఉన్నా.. మహీ (39 ఏళ్లు) ఫ్యూచర్‌‌పై సందేహాలు మొదలైన నేపథ్యంలో.. సీఈవో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

‘2021లోనూ మా టీమ్‌‌ను ధోనీయే నడిపిస్తాడు. ఇందులో ఎలాంటి అనుమానాల్లేవు. మాకు మూడు టైటిల్స్‌‌ సాధించిపెట్టాడు. ప్లే ఆఫ్స్‌‌కు క్వాలిఫై కాకపోవడం ఇదే మొదటిసారి. ఈ టీమ్‌‌కు కూడా ఇలాంటి రికార్డు లేదు. ఒక్క ఏడాది బాగా ఆడలేదంటే.. మొత్తం మార్చేయమని అర్థం కాదు. ఈ సీజన్‌‌లో మా సత్తా మేరకు ఆడలేదు. గెలవాల్సిన కొన్ని మ్యాచ్‌‌ల్లో ఓడటం వల్లే దెబ్బతిన్నాం. రైనా, హర్భజన్‌‌ లేకపోవడం, మా క్యాంప్‌‌లో కొవిడ్‌‌ కేసులు పెరగడం టీమ్‌‌ బ్యాలెన్స్‌‌పై ప్రభావం చూపింది.

ఈసారి బాగా ఆడకపోయినా.. వచ్చే ఏడాది కచ్చితంగా మేం పుంజుకుంటాం’ అని విశ్వనాథన్‌‌ వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది కూడా ధోనీయే సారథ్యం వహిస్తే.. కచ్చితంగా టీమ్‌‌ కొత్త లుక్‌‌తో ఉంటుందని గతంలోనే హెడ్‌‌ కోచ్‌‌ స్టీఫెన్‌‌ ఫ్లెమింగ్‌‌ అన్నాడు. ఇప్పుడున్న టీమ్‌‌లో సత్తా తగ్గిందని అభిప్రాయపడ్డాడు. నెక్స్ట్‌‌ ఇయర్‌‌ మెగా ఆక్షన్‌‌ ఉండటంతో.. రైనా, హర్భజన్‌‌, కేదార్‌‌, చావ్లాలాంటి ప్లేయర్లను వదులుకోవాలని సీఎస్‌‌కే చూస్తోంది.

for More News…..