స్టోక్స్ కేప్టెన్పీపై ధోనీదే నిర్ణయం: కాశీ విశ్వనాథన్​

స్టోక్స్ కేప్టెన్పీపై ధోనీదే నిర్ణయం: కాశీ విశ్వనాథన్​

చెన్నై: ఇంగ్లండ్​ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​ టీమ్​లోకి రావడంపై కెప్టెన్​ ఎం.ఎస్​. ధోనీ సూపర్​ హ్యాపీగా ఉన్నాడని చెన్నై సూపర్​కింగ్స్​ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్​ అన్నారు. ఆక్షన్​లో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటూ.. తమ టీమ్​ను మహీ చాలా గైడ్​ చేశాడన్నారు. సీఎస్​కే కెప్టెన్సీ స్టోక్స్​ అప్పగించే విషయంపై  ధోనీ తుది నిర్ణయం తీసుకుంటాడని కాశీ స్పష్టం చేశాడు. 

‘మా లైనప్​లోకి స్టోక్స్​ రావడంపై మహీతో సహా అందరం సంతోషంగా ఉన్నాం. మరో ఆల్​రౌండర్​ లభించినందుకు ధోనీ హ్యాపీగా ఉన్నాడు.  స్టోక్స్​ రూపంలో కెప్టెన్సీ ఆప్షన్​ ఉన్నా.. ఈ విషయంలో ధోనీదే తుది నిర్ణయం’ అని కాశీ పేర్కొన్నారు. మరోవైపు రాబోయే సీజన్​లోనే స్టోక్స్​.. ధోనీ నుంచి పగ్గాలు అందుకుంటాడని కివీస్​ మాజీ ప్లేయర్​ స్కాట్​ స్టైరిస్​ అంచనా వేశాడు. కెప్టెన్సీ కోసమే స్టోక్స్​ను తీసుకున్నారని చెప్పాడు.