Actor Nadeem Khan: ‘ధురంధర్’ నటుడు నదీమ్ ఖాన్ అరెస్ట్.. 10 ఏళ్లుగా పనిమనిషిపై అత్యాచారం!

Actor Nadeem Khan: ‘ధురంధర్’ నటుడు నదీమ్ ఖాన్ అరెస్ట్.. 10 ఏళ్లుగా పనిమనిషిపై అత్యాచారం!

బాలీవుడ్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ధురంధర్’.. మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి వసూళ్ల ప్రభంజనంతో కాదు.. అందులో నటించిన నటుడు నడీమ్ ఖాన్ చేసిన పనికిమాలిన పని గురించి. తన ఇంట్లో పనిచేసే పనిమనిషిని 10 సంవత్సరాల పాటుగా అత్యాచారం చేసిన ఆరోపణలపై, నదీమ్ ఖాన్‌ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో బాలీవుడ్ సినీవర్గాలు షాక్ అయ్యాయి. 

పోలీస్ సమాచారం ప్రకారం, 41 ఏళ్ల మహిళ ఫిర్యాదు ఆధారంగా జనవరి 22న నదీమ్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతానికి ఖాన్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఫిర్యాదులో మహిళ తెలిపినట్లుగా, ఆమె వివిధ నటుల ఇంట్లో  పనిమనిషిగా పని చేసింది. కొన్నేళ్ల క్రితం నదీమ్ ఖాన్తో పరిచయం అయ్యి సన్నిహితులయ్యారు.

ఖాన్ ఆమెతో పెళ్లి చేసుకుంటానని భరోసా ఇచ్చి, మల్వానీ మరియు వర్సోవా ప్రాంతాల తన ఇళ్లలో 10 సంవత్సరాలపాటు అనేకసార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఖాన్, తనను పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోవడంతో, బాధితురాలు వర్సోవా పోలీస్‌ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందని పోలీసులు తెలిపారు.

అయితే, మొదటి అత్యాచారం మల్వానీ పోలీస్‌ పరిధిలోని బాధితురాలి ఇంట్లో జరిగినందున, వర్సోవా పోలీసులు కేసును జీరో ఎఫ్‌ఐఆర్‌ (Zero FIR)గా ట్రాన్స్‌ఫర్ చేశారు. నదీమ్ ఖాన్ చివరగా రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమాలో కనిపించారు.