డబ్ల్యూటీటీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌కు దియా–మనుష్‌‌‌‌‌‌‌‌ జోడీ

డబ్ల్యూటీటీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌కు దియా–మనుష్‌‌‌‌‌‌‌‌ జోడీ

న్యూఢిల్లీ: ఇండియా టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు దియా చిటాలే–మనుష్‌‌‌‌‌‌‌‌ షా.. తొలిసారి డబ్ల్యూటీటీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించారు. వీళ్లిద్దరు మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో పోటీపడనున్నారు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 10 నుంచి 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. మెన్స్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌–16 ప్లేయర్లు, మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌–8 ప్లేయర్లు పోటీపడతారు. 

టోర్నీ మొత్తం ప్రైజ్‌‌‌‌‌‌‌‌మనీ రూ. 11.46 కోట్లు. ఈ ఏడాది మొత్తం నిలకడైన ప్రదర్శన చూపెట్టిన దియా–మనుష్‌‌‌‌‌‌‌‌... బ్రెజిల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్‌‌‌‌‌‌‌‌లో  రజతం నెగ్గారు. ఫలితంగా మెగా ఫైనల్స్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయ్యారు. ‘ఫైనల్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనడం చాలా పెద్ద గౌరవం. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లుగా నిలవడం మరింత సంతోషం. 

ఈ క్షణం మాది మాత్రమే కాదు. ఇండియా టీటీ ఎంతగా అభివృద్ధి చెందిందో, దాని భవిష్యత్‌‌‌‌‌‌‌‌ ఎంత ఉజ్వలంగా ఉందో చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఈ కథలో చిన్న పాత్ర పోషించడం నాకు గర్వంగా ఉంది. దానిని మరింత చిరస్మరణీయంగా మార్చడానికి మా వంతు కృషి చేస్తాం’ అని దియా పేర్కొంది.